: వైకాపాకు కోనేరు రాజేంద్రప్రసాద్ రాజీనామా
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు, వైకాపా నేతగా ఉన్న కోనేరు రాజేంద్ర ప్రసాద్ బుధవారం సంచలన నిర్ణయం ప్రకటించారు. వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టు విజయవాడలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేకాదు, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా తెలిపారు. రాజేంద్రప్రసాద్ గత ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.