: చెలరేగి ఆడిన పాక్ క్రీడాకారులు... ‘బంగ్లా’ ముంగిట భారీ లక్ష్యం!
టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ క్రీడాకారులు చెలరేగి ఆడారు. దీంతో పాక్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. మూడో ఓవర్ లో పాక్ ఓపెనర్ షర్జీల్ ఖాన్(18) ఔటయ్యాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన అహ్మద్ షెజాద్(52), హఫీజ్ (64) అర్ధశతకాలు సాధించారు. జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. కెఫ్టెన్ అఫ్రిది (49) కూడా చెలరేగి ఆడాడు. ఇక, బంగ్లా బౌలర్ల విషయానికొస్తే, తస్కిన్ అహ్మద్ 2, అరాఫత్ సన్నీ 2, రహమాన్ 1 వికెట్ తీసుకున్నారు.