: హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను ప్రారంభించిన రాష్ట్రపతి
హైదరాబాద్ లోని బేగం పేట విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ ఏవియేషన్ షో ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్ది సేపటి క్రితం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అంతకుముందు, రాష్ట్రపతి ప్రణబ్ కు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, స్పీకర్, మండలి చైర్మన్, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, హైదరాబాద్ నగర మేయర్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ ఏవియేషన్ షో ఐదు రోజుల పాటు సాగుతుంది. మొదటి మూడు రోజులు బిజినెస్ విజిటర్స్ కోసం, చివరి రెండు రోజులు సందర్శకులకు అనుమతి ఇస్తారు. ఈ షోలో 25 దేశాల నుంచి 200 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారు.