: హార్దిక్ పటేల్ అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు: జైలు అధికారులు


గుజరాత్ కు చెందిన పటేల్ యువ నేత హార్దిక పటేల్ అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడని, జైలు నుంచి అతన్ని మార్చాలంటూ న్యాయస్థానానికి జైలు సిబ్బంది విన్నవించుకున్నారు. సూరత్ లోని లాజ్ పోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న హార్దిక్ పై జైలు సూపరింటెండెంట్ ఆర్ఎం పాండే సెషన్స్ కోర్టుకు విన్నవించారు. హార్దిక్ ప్రవర్తన కారణంగా జైలు భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇటీవల హార్దిక్ పటేల్ కు వచ్చిన ఒక కవర్ లో మొబైల్ ఫోన్, ఛార్జర్, బ్యాటరీ ఉండటాన్ని తాము గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నామని, అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, తనకు వచ్చిన ఉత్తరాలను జైలు సిబ్బంది ఇవ్వడం లేదంటూ హార్దిక్ కోర్టుకు ఫిర్యాదు చేయడం.. జైలు సిబ్బందికి కోర్టు నోటీసులు జారీ చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News