: యూకేలో తక్కువ వేతనం ఉన్న విదేశీయులు ఇక వెనక్కే... భారతీయులకే ఎక్కువ నష్టం!


ఉద్యోగాల కోసం వచ్చి తమ దేశంలో స్థిరపడిపోతున్న విదేశీయులకు అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా యూకే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కనీస వేతన పరిమితి అనే నిబంధనను లెక్కలోకి తీసుకుంటోంది. దీని ప్రకారం, యూకేలో పనిచేసే విదేశీ ఉద్యోగుల వార్షిక వేతనం 35000 పౌండ్ల (33.40 లక్షలు) కంటే తక్కువ వున్న వారిని వారి స్వదేశాలకు తిరిగి పంపించేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి ఈ నూతన నిబంధన అమలులోకి వస్తుంది. దీని ప్రకారం ఆయా వ్యక్తులు తమ స్వదేశాలకు వెళ్లకపోతే వారిని బహిష్కృతులుగా ప్రకటించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఉద్యోగాల పేరిట యూకేకు వచ్చి చాలా మంది అక్కడే స్థిరపడిపోతుండడంతో 2012లో అక్కడి ప్రభుత్వం ఈ నిబంధనను తెచ్చింది. అయితే, 2011 ఏప్రిల్ 6 తర్వాత యూకేకు వచ్చిన వారి విషయంలోనే ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. ఇలా టైర్-2 వీసాపై యూకేకు వచ్చే విదేశీయులలో ఎక్కువ మంది భారతీయులే వుంటున్నారు. ఇప్పుడీ కొత్త నిబంధన కారణంగా నష్టపోయేది కూడా ఎక్కువగా భారతీయులే. సుమారు నలభై వేల మంది భారతీయులు ఈ విషయంలో సమస్యలు ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News