: రెండేళ్లుగా చంద్రబాబు ఇదే రీలు తిప్పుతున్నారు!: వైఎస్ జగన్
ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తీర్మానంలో పేర్కొనాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. విభజన హామీల అమలు కోసం తీర్మానం చేయడం ఇది రెండోసారని, రెండేళ్లుగా చంద్రబాబు ఇదే రీలు తిప్పుతున్నారని జగన్ విమర్శించారు. ‘ఇక్కడేమో బీద అరుపులు, అక్కడేమో పొగడ్తలు. ఇప్పటికే రెండేళ్లు గడిచింది. నెలరోజుల్లో అమలు చేయకుంటే, కేంద్రం నుంచి వైదొలుగుతామని అల్టిమేటం ఇస్తారా?’ అంటూ ప్రభుత్వానికి వైఎస్ జగన్ సవాల్ విసిరారు.