: వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు విద్యార్థుల సంక్షేమం కోసం స్కాలర్ షిప్ లు మంజూరు చేయాలనుకుంటున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ స్కాలర్ షిప్ లు మంజూరు చేస్తామని రామాంజనేయులు చెప్పారు.