: రోజా సస్పెన్షన్ కేసును అత్యవసర వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు!
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు పరిశీలించింది. రోజా తరపు న్యాయవాదుల ద్వారా వివరాలను తెలుసుకుంది. అనంతరం రిజిస్ట్రార్ ను పిలిపించి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మరో బెంచ్ కు అప్పగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అత్యవసర వ్యాజ్యంగా స్వీకరించి, మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపట్టనున్నారు.