: వరంగల్ జిల్లాలో దారుణం, యువతిపై అఘాయిత్యం


వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం కరుణాపురంలో ఒక యువతిపై దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం రాత్రి పందొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న ఆ యువతిని కన్నాపురం చర్చికి సమీపంలోకి తీసుకెళ్లారు. ఆమెకు మద్యం తాగించి ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో పోలీసుల గస్తీ వాహనం అటుగా రావడంతో దాని సైరన్ విన్న నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని సమీపంలోని ఒక ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆదివారం సాయంత్రం ఆమె కోలుకోవడంతో, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి వివరాలు సేకరించారు. నిందితుల్లో ఒక ఆర్మీ జవాను కూడా ఉన్నాడు. బాధితురాలు, ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News