: ఆకాశంలో సగం... నిరూపించిన బ్రూనే మహిళలు!
మహిళను ఆకాశంలో సంగం అంటారు. అంటే, అన్నింటా ఆమెకు కూడా సమాన హక్కు వుందని. అయితే, సౌదీ అరేబియాలో మాత్రం ఈ సూత్రం వర్తించదు. మహిళలు వాహనాలను నడపడానికి అక్కడ అవకాశం లేదు. అలాంటి సౌదీ అరేబియాలో బ్రూనే మహిళా పైలట్లు చరిత్ర సృష్టించారు. ముగ్గురు మహిళా పైలట్లు విమానం నడుపుకుంటూ వచ్చి అక్కడ ల్యాండయ్యారు. బ్రూనే జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముగ్గురు మహిళా పైలట్లతో కూడిన విమానం రాయల్ బ్రూనే నుంచి జెడ్డాకు చేరుకుంది. ఫ్లయిట్ కెప్టెన్ షరీఫా సిజరేనాతోపాటు సీనియర్ ఆఫీసర్లు నార్డిన్, పీజీ ఖాషీమ్ ఈ బృందంలో ఉన్నారు. సౌదీ అరేబియాలో పురుషులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ లు ఇస్తారు. మహిళలు ఎవరైనా వాహనాలను నడుపుతూ కనిపిస్తే పట్టుకుని జరిమానాలు విధించడం, అరెస్ట్ చేయడం అక్కడ సర్వసాధారణం. ప్రపంచంలో సౌదీ అరేబియా ఒక్కటే మహిళలను డ్రైవింగ్ కు అనుమతించడం లేదు. ఈ నిబంధనలను సడలించాలంటూ అక్కడి మహిళలు సామాజిక మాధ్యమాల్లో తెగ పోరాటం చేస్తున్నారు. వీరి కృషి ఫలితమో, మరొకటో గానీ గతేడాది సౌదీ అరేబియాలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఓటింగ్ కు మహిళలను అనుమతిస్తూ రాజు అబ్దుల్లా నిర్ణయం తీసుకున్నారు.