: మారువేషాల్లో వీధుల్లో తిరిగొస్తామన్న అమితాబ్, రజనీకాంత్!
తమకు ఎప్పుడైనా వీధుల్లో తిరగాలనిపిస్తే మారువేషాల్లో బయటకు వెళ్తామని అగ్రనటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లు పేర్కొన్నారు. అమితాబ్ తాజా చిత్రం ‘ఆగ్రా కా దాబ్రా’ ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ నిమిత్తం ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన... ఒక ఖాకీ ప్యాంటు, బాగా వదులుగా ఉండే చొక్కా, ముఖాన్ని కవర్ చేసే ఒక టోపీ ధరించి, ఢిల్లీ వీధుల్లో సైకిలెక్కి తిరిగారట. కాగా, మరో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మారువేషంలో బెంగళూరు వీధుల్లో తిరుగుతుంటారట. తాను నిత్యం ఆరాధించే దైవం కొలువై వుండే గుడిని సందర్శించాలనుకున్నప్పుడు, తన స్నేహితులను కలవాలనిపించినప్పుడు రజనీ మారువేషంలో వెళుతుంటారట.