: మొదటి బాల్ సిక్స్... రెండో బాల్ కి వికెట్!


నాగపూర్ వేదికగా ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య పోరు ప్రారంభమైంది. అశ్విన్ బౌలింగ్ లో మొదటి బాల్ సిక్స్ కొట్టిన కివీస్ ఓపెనర్లు... రెండో బాల్ కి ఒక వికెట్ ను కోల్పోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కివీస్ మరో వికెట్ ను కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ లో గుప్తిల్, నెహ్రా బౌలింగ్ లో మున్రో అవుటయ్యారు. కివీస్ జట్టు 2.1 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 14 పరుగులతో ఉంది. ప్రస్తుతం క్రీజ్ లో ఆండర్సన్, విలియన్ సన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News