: రేపు ‘యనమల’ పై అవిశ్వాసం పెడతారేమో!: బీజేపీ ఎమ్మెల్యే


నిన్న చంద్రబాబు సర్కార్ పైన, నేడు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పైన అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిపై పెడతారేమోనంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చమత్కరించారు.'నిబంధనలు అనుమతిస్తే వైఎస్సార్సీపీ ఈ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వెనుకాడదేమో' అని అన్నారు. విష్ణుకుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ సభ్యులతో పాటు అధికారపక్షం సభ్యులు కూడా నవ్వులు చిందించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల స్పందిస్తూ ‘నాతో పాటు నీపై కూడా అవిశ్వాసం పెడతారులే’ అని ఆయన అన్నారు. దీనికి విష్ణుకుమార్ రాజు ప్రతిస్పందిస్తూ,‘నన్ను బయటకు పంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు పెద్దలు ఇక్కడే ఉండాలి’ అని సమాధానమిచ్చారు. కాగా ప్రతిపక్షంలో ఉన్నవారు ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోవాలని, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం దురదృష్టకరమని విష్ణుకుమార్ రాజు అన్నారు.

  • Loading...

More Telugu News