: స్పీకర్ కోడెల కడిగిన ముత్యం: పల్లె రఘునాథరెడ్డి
గతంలో కోడెల శివప్రసాదరావు పై నమోదైన అన్ని కేసుల నుంచి కడిగిన ముత్యంలా ఆయన బయటపడ్డారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెలపై వైఎస్సార్సీపీ సభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలకు పల్లె ఘాటుగా స్పందించారు. ఒక సీనియర్ నేతపై ఇటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. కోడెలపై నమోదైన కేసులన్నింటి నుంచి క్లీన్ చిట్ తో ఆయన బయటకు వచ్చారని, ఎటువంటి మచ్చ ఆయనపై లేదని పల్లె పేర్కొన్నారు.