: కాంగ్రెస్ వైఖరిని తూర్పారబట్టిన సీపీఐ నారాయణ
తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు జరుగుతుంటే రాష్ట్రం నుంచి ఎన్ని సీట్లు వస్తాయని ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరి శ్మశానంలో బొగ్గులేరుకునే చందంగా ఉందని సీపీఐ రాష్ట్ర్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. హైదరాబాదులోని సీపీఐ రాష్ట్ర్ర కార్యాలయంలో ఆహర భద్రతపై బుక్ లెట్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహర భద్రత కోసం దేశవ్యాప్తంగా వామపక్షాలు ఉద్యమిస్తాయన్నారు. మరోవైపు తెలంగాణ సాధనలో ఎన్నికల ప్రక్రియ కీలకమన్న టీఆర్ఎస్ వైఖరితో వామపక్షాలు ఏకీభవించడం లేదని నారాయణ తెలిపారు.