: తన పేరును ప్రస్తావిస్తున్న కంగనా రౌనత్ కు నోటీసులు పంపిన హృతిక్ రోషన్
మీడియా సమావేశాల్లో పదే పదే తన పేరును ప్రస్తావిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రౌనత్ కు హీరో హృతిక్ రోషన్ నోటీసులు పంపాడు. సుజానేతో విడిపోయిన తరువాత ఆయన కంగనాను ప్రేమించాడని, ఆపై విడిపోయాడని వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలి మీడియా సమావేశాల్లో కంగనా స్పందిస్తూ, కొందరు మాజీ ప్రేమికులు తనపై పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపించింది. ఆషికి-3 నుంచి తనను హృతిక్ తప్పించాడని కూడా చెప్పింది. ఈ మాటలను సీరియస్ గా తీసుకున్న హృతిక్, తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా, తానెన్నడూ హృతిక్ పేరును చెప్పలేదని, ఆయన పరువు ఎక్కడ పోయిందని కంగనా ప్రశ్నిస్తోంది.