: కృష్ణమాచారి శ్రీకాంత్ మధ్యవర్తిగా హీరో విశాల్ కు వలేస్తున్న బీజేపీ!


వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తమిళనాట ఎన్నికల ప్రచార నిమిత్తం రానున్న నేపథ్యంలో, ఈలోగా క్రేజీస్టార్ విశాల్ ను పార్టీలోకి వచ్చేలా చూడాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ ను బీజేపీలో చేరేందుకు ఒప్పించే బాధ్యతలను చెన్నై నివాసి, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేత మురళీధరరావుతో భేటీ అయి చర్చలు జరిపిన శ్రీకాంత్, ఆపై విశాల్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. మైలాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విశాల్ ను పోటీకి దించుతామన్న ఆఫర్ ను ఇచ్చినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతానికి తాను నడిగర సంఘం భవన నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, బీజేపీ తరఫున పోటీ చేసే సినీ నటుల పేర్లలో విసు, వైజయంతీమాల పేర్లు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News