: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: అసెంబ్లీలో దేవినేని ఉమా ప్రకటన


కరవు సీమ రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. గాలేరు-నగరి సుజల స్రవంతిలో అవినీతి చోటుచేసుకుందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ దేవినేని సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల్లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 8.8 టీఎంసీల నీటిని నిల్వ చేయడం ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పంటలను కాపాడామని ఆయన చెప్పారు. పట్టిసీమ కన్నా డబుల్ స్పీడుతో గాలేరు-నగరి ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేసి కడప జిల్లాను సాగు నీటి కష్టాల్లో నుంచి బయట పడేస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News