: రిజర్వేషన్ విధానం ఇప్పట్లో మారదు: జైట్లీ స్పష్టీకరణ


దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ విధానానికి ఇప్పట్లో సవరణలు చేసే అవకాశాలు లేవని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కుండబద్దలు కొట్టారు. కులాల రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడున్న విధానమే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలు, విద్య తదితర విషయాల్లో రిజర్వేషన్లు ఉండరాదని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆర్ఎస్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు లోక్ సభలో నినాదాలు చేయగా, జైట్లీ స్పందించారు. "కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్ల విధానాన్ని కొనసాగిస్తాం. ఇప్పట్లో మార్చే ఉద్దేశాలు లేవు" అని ఆయన అన్నారు. ఏ వర్గానికీ రిజర్వేషన్లు తొలగించబోమని, కొత్తగా జాబితాలో ఎవరినీ చేర్చలేమని అన్నారు. అంతకుముందు ఎంపీలు మాయావతి, రాంగోపాల్ యాదవ్ తదితరులు ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యల విషయమై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News