: రాహుల్ బ్రిటిష్ పౌరసత్వానికి సంబంధించి నేను సమర్పించిన డాక్యుమెంట్లు అసలైనవే!: సుబ్రహ్మణ్యస్వామి
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను బ్రిటిష్ పౌరుడినేనని గతంలో పేర్కొన్న అంశంపై.. తాను సమర్పించిన డాక్యుమెంట్లు అసలైనవేనని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఆ డాక్యుమెంట్లు కంపెనీ సెక్రటరీ హోదాలో రాహుల్ గాంధీ సమర్పించిన డాక్యుమెంట్లేనన్నారు. డాక్యుమెంట్లపై రాహుల్ గాంధీ సంతకం సైతం ఉందని చెప్పారు. ఎథిక్స్ కమిటీ వద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, అవి నిజమైనవేనని భావించే కమిటీ నోటీసులు జారీ చేసిందన్నారు. రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.