: ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ రవిశంకర్ కు అరుదైన గౌరవం


ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీకి బ్రిటన్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ పార్లమెంట్ దిగువసభ హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రసంగించాలని బ్రిటిష్ ప్రధాన మంత్రి కామెరూన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. కాగా, ఇటీవల ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ మూడు రోజుల పాటు ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించింది. ఈ ఉత్సవాలకు బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటేరియన్ మాథ్యూ ఒఫ్పర్డ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కామెరూన్ పంపిన ఆహ్వానాన్ని ఆయన రవిశంకర్ కు అందజేశారు. కామెరూన్ తన సందేశంలో శ్రీశ్రీ రవిశంకర్ ను ప్రశంసించారు. ప్రపంచాన్ని మార్చే పనిని రవిశంకర్ ఇప్పటికే ప్రారంభించారని కామెరూన్ తన సందేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News