: బాబుకు దమ్ముంటే తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే తుని ఘటనపై సీబీఐతో ఎంక్వయిరీ జరిపించాలని ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం నాడు చేపట్టిన దీక్షకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి, దీక్షా స్థలికి దగ్గరలో రైల్వే ట్రాక్ ఉన్న విషయం తెలియదా? అని, పోలీస్ బందోబస్తు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ నేతలపై అధికార పక్ష సభ్యులు ఆరోపణలు చేయడాన్ని జగన్ ఖండించారు. తుని ఘటనపై సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరినట్లు జగన్ పేర్కొన్నారు.