: స్వార్థంతో రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తున్న నాయకుడు జగన్: అచ్చెన్నాయుడు


ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థంతో రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడితే చాలు, దానికి అడ్డుతగలడం జగన్ కు అలవాటైందని.. రాష్ట్రాభివృద్ధికి మంచి సలహాలు, సూచనలు ఇచ్చిన పాపాన జగన్ పోలేదంటూ ఆయన మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటపడేయాలని చూస్తుంటే ప్రతిపక్షం తమపై అభాండాలు వేయడం సబబు కాదన్నారు. ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని, ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ భారీ అవినీతికి పాల్పడిందని, 43 లక్షల ఇళ్లల్లో 15 లక్షల ఇళ్లను తమ కార్యకర్తలకే వారు కట్టబెట్టారని ఆరోపించారు. మొదటి ఏపీ అసెంబ్లీలో ఏవైతే మాట్లాడారో అవే విషయాలను జగన్ ప్రతిసారి మాట్లాడుతున్నారని, ఒకటే స్పీచ్ రిపీట్ చేస్తున్నాడని అచ్చెన్నాయుడు విమర్శించారు.

  • Loading...

More Telugu News