: చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే!: వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, సభ జరుగుతున్న తీరు తనకు చాలా బాధ కల్గిస్తోందని, పరిటాల రవి హత్య కేసులో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగాను చంద్రబాబు నాయుడే చంపించారని హరిరామజోగయ్య పుస్తకం కూడా రాశారని, హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారా? లేదా? అని, హరిరామజోగయ్య రాసిన పుస్తకం గురించి ప్రస్తావిస్తే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు.