: అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణిని పరీక్షించిన భారత్!


ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదించేలా డీఆర్డీఓ, రక్షణ పరిశోధనా విభాగాలు సంయుక్తంగా తయారు చేసిన అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి సైనిక ప్రయోగాల్లో భాగంగా దీన్ని పరీక్షించగా, 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిందని అధికారులు ప్రకటించారు. కాగా, గత సంవత్సరం నవంబర్ 27న సైతం అగ్ని-1 క్షిపణి ప్రయోగం నిర్వహించి విజయవంతం చేసిన సంగతి తెలిసిందే. మధ్యంతర ఖండాంతర క్షిపణిగా రూపొందిన ఈ క్షిపణిని మరింతగా అభివృద్ధి చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది.

  • Loading...

More Telugu News