: ఏపీ అసెంబ్లీలో కనిపించని ఆ ఎనిమిది మంది!


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా విజయం సాధించి, ఆపై ఇటీవలి కాలంలో తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలో కనిపించడం లేదు. వైకాపా పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన వేళ, వీరంతా సభకు హాజరు కాలేదు. వీరికి విప్ జారీ చేశామని ఇప్పటికే స్పష్టం చేసిన వైకాపా, వీరు అసెంబ్లీకి వచ్చి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకుంటే, చట్టపరమైన చర్యలకు వెళ్లాలని భావిస్తోంది. కాగా, వైకాపా అవిశ్వాసంపై వేగంగా పావులు కదిపిన తెలుగుదేశం పార్టీ తక్షణ చర్చకు అనుమతించగా, ఫిరాయింపుదారులు సభలో లేకుండానే చర్చ జరుగుతోంది. ఇక వారికి వైకాపా జారీ చేసిన విప్ అందిందా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలతో పాటు పాలపర్తి డేవిడ్ రాజు తదితర 8 మంది తెదేపాలో చేరిన వారు ప్రస్తుతం సభలో లేరు.

  • Loading...

More Telugu News