: ప్రిపేర్ కాలేదన్న విష్ణుకుమార్ రాజు... ముసిముసి నవ్వులు చిందించిన చంద్రబాబు


తన సర్కారుపై విపక్షం వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాస్తంత రిలాక్స్ డ్ గానే కాకుండా ఒకింత ఉల్లాసంగా కూడా కనిపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో లేని చంద్రబాబు... అవిశ్వాసంపై చర్చకు అందిరితో పాటే సభలోకి ప్రవేశించారు. చర్చ ఎలా నిర్వహించాలన్న విషయంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ... సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజుల మధ్య జరిగిన వాద ప్రతివాదనలను వింటూ చంద్రబాబు ముసిముసిగా నవ్వులు చిందించారు. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు ప్రిపేర్ అయ్యి రాలేదని విపక్షం వైపు చేతులు చూపిన విష్ణుకుమార్ రాజు వ్యంగ్యాస్త్రాలకు చంద్రబాబు మరింతగా నవ్వేశారు.

  • Loading...

More Telugu News