: టర్కీలో ఉగ్రదాడి... 34 మంది మృతి, 125 మందికి గాయాలు!


టర్కీ రాజధాని అంకారాలో అత్యంత జనసమ్మర్థం ఉండే కిజిలే స్క్వేర్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. వాణిజ్య సముదాయాలు, ట్రాన్స్ పోర్ట్ హబ్ ఉన్న ఈ ప్రాంతంలో కారు నిండా బాంబులు నింపుకుని వచ్చిన ఉగ్రవాదులు దాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో 34 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 125 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు వచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, గత ఐదు నెలల వ్యవధిలో అంకారాపై ఇది మూడవ ఉగ్రదాడి. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.

  • Loading...

More Telugu News