: అగ్రరాజ్యంలో మరో తెలుగు సంఘం!... ‘అమెరికా తెలంగాణ అసోసియేషన్’ ఆవిర్భావం


అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ప్రజలు చాలా మందే ఉన్నారు. విద్యాభ్యాసం కోసం వెళ్లిన కొందరు అక్కడే ఉద్యోగాలు సాధించి స్థిరపడిపోతుండగా, ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు సాధించి ఆ దేశంలో కాలిడిన ‘తెలుగు వెలుగులు’ గ్రీన్ కార్డ్ హోల్డర్లుగా మారిపోతున్నారు. ఈ రెండు కేటగిరీల కింద ప్రస్తుతం అమెరికాలో స్థిరపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. పరాయి దేశంలో తమ వారికి ఇబ్బందులు ఎదురు కాకూడదన్న భావనతో అక్కడి తెలుగు ప్రజలు పలు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కోవకు చెందినవే ‘తానా’, ‘ఆటా’ తదితర సంఘాలు. తాజాగా అమెరికా గడ్డపై మరో తెలుగు సంఘం పురుడుపోసుకుంది. ‘అమెరికన్ తెలంగాణ అసోసియేషన్’ పేరిట నిన్న ఓ కొత్త సంఘానికి తెలంగాణకు చెందిన అక్కడి ప్రజలు శ్రీకారం చుట్టారు. సంఘం ఆవిర్భావాన్ని అట్టహాసంగా ప్రకటించిన అక్కడి తెలంగాణ వాసులు... త్వరలోనే ‘ప్రపంచ తెలంగాణ మహాసభ’లను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంఘం కార్యవర్గం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News