: ఈటల ‘పద్దు’కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!... 11.35 గంటలకు అసెంబ్లీ ముందుకు తెలంగాణ బడ్జెట్
కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడి అప్పుడే రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికే ఓ స్వల్పకాలిక బడ్జెట్ తో పాటు మరో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్... నేడు రెండో మారు పూర్తి స్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రూ.1.30 లక్షల కోట్లతో ఈటల వండివార్చిన బడ్జెట్ కు ఇప్పటికే తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ సమక్షంలో భేటీ అయిన మంత్రిమండలి 2016-17 ఏడాదికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాకు ఆమోదాన్ని తెలిపింది. నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 11.35 గంటలకు ఈటల బడ్జెట్ ను సభ ముందుంచనున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికే ఈటల అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లు సమాచారం. అసెంబ్లీలో బడ్జెట్ ను ఈటల ప్రతిపాదించనుండగా, శాసనమండలిలో ఆ బాధ్యతను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీసుకోనున్నారు.