: హోంవర్క్ చేయనందుకు నగ్నంగా నిలబెట్టిన వైనం.. వాట్సప్‌లో వీడియో వైరల్
హోంవర్క్ చేయనందుకు రెండు, మూడో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులను నగ్నంగా నిలబెట్టారో ట్యూటోరియల్ నిర్వాహకులు. విద్యార్థులు నగ్నంగా ఉండి, విలపిస్తున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వాట్సప్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి చేరడంతో విషయం వెలుగులోకొచ్చింది. ముంబయి మల్వానీ ప్రాంతంలోని శ్రీ ట్యుటోరియల్ పాఠశాలలో తరగతి గది బయట విద్యార్థులను నగ్నంగా నిలబెట్టి పనిష్మంట్ ఇస్తుండగా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దీన్ని ఫోన్‌లో చిత్రీకరించి వాట్సాప్‌లో పెట్టాడు. ఈ వీడియో వాట్సప్‌లో అటు ఇటు తిరిగి చివరికి పోలీసుల దృష్టికి వెళ్లింది. ముంబయి పోలీస్ కమిషనర్ దత్త పడ్సల్గికర్ ఈ వీడియోను చూసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనకు కారకులైన ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.