: కత్రినాకైఫ్, రణబీర్ ల మధ్య మౌనయుద్ధం!
అందం, అభినయంతో అభిమానుల్ని అలరించే బాలీవుడ్ బ్యూటీ కత్రినాతో తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ మాట్లాడడానికి అస్సలు ఇష్టపడట్లేదట. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'జగ్గా జసూస్' సినిమాలో రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ సన్నివేశం చిత్రీకరణలో ప్రస్తుతం ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అయితే, కెమెరా ముందు తప్ప అక్కడ ఖాళీ సమయాల్లో కత్రీనాతో రణబీర్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నాడట. తన మాజీ ప్రియురాలితో అస్సలు మాట్లాడడం లేదట. అయితే, కత్రినా అయినా రణబీర్ ను ప్రేమతో పలకరిస్తుందనుకుంటే.. ఆమె కూడా అతని బాటలోనే నడుస్తోంది. ఈ మధ్యే కత్రినా కైఫ్‌కి రణబీర్ తో విభేదాలొచ్చి కొత్త ఇంటిని వెతికే పనిలో పడింది. కత్రినాతో బ్రేక్ అప్ అవడంతో రణబీర్ కూడా తన తల్లిదండ్రులుండే బంగ్లాకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.