: ధోనీలా మ్యాచ్ ఫినిషర్ పాత్ర పోషించడం నాకు ఇష్టం: పాక్ క్రికెటర్ సర్ఫరాజ్


టీమిండియా కెప్టెన్ ధోనీలా మ్యాచ్ ఫినిషర్ పాత్ర పోషించడం తనకు ఇష్టమని పాకిస్థాన్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అన్నాడు. తాను చాలా వరకు ధోనీని అనుసరిస్తానని, ఆయన నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటానని చెప్పాడు. భారత్ గర్వించదగిన గొప్ప క్రికెటర్ ధోనీ అని...ఆయనే తనకు ఆదర్శమని సర్ఫరాజ్ తన మనస్సులో మాట బయటపెట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్ గురించి సర్ఫరాజ్ మాట్లాడుతూ, ఈ టోర్నీలో పాల్గొననుండటం తనకు సంతోషంగా ఉందని, పాక్ జట్టు అవసరాల మేరకు తాను ఆడతానని చెప్పాడు.

  • Loading...

More Telugu News