: విజయనగరం జిల్లాలో బైక్ రేసింగ్ కుర్రాళ్ల అరెస్టు
బైక్ రేసింగ్ లకు దిగిన ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్టణం నుంచి విజయనగరం జిల్లా పైడి భీమవరం వరకు వీరు బైక్ రేసింగ్ లతో జాతీయ రహదారిపై వాహనదారులకు ఇబ్బంది కల్గిస్తున్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి నాలుగు బైక్ లను స్వాధీనం చేసుకుని వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.