: పాక్ జట్టు రాకతో 'క్యాబ్' పంట పండింది!


దాదాపు రూ. 3.7 కోట్ల నష్టాల్లో ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) పంట పండే సమయం వచ్చింది. అనూహ్య పరిస్థితుల్లో భారత్, పాక్ టీ-20 మ్యాచ్ వేదిక ధర్మశాల నుంచి కోల్ కతాకు మారడంతో, టికెట్ల అమ్మకాల మూలంగానే క్యాబ్ దాదాపు రూ. 3 కోట్లను వెనకేసుకోనుంది. మార్చి 19న జరిగే భారత్, పాక్ మ్యాచ్ ఈ టోర్నమెంటులోనే అత్యధిక వ్యాపార ప్రకటనల ఆదాయాన్ని ఐసీసీ ఖజానాకు చేరవేస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్ కి టికెట్ ధరలను రూ. 500, రూ. 1,000, రూ. 1,500లుగా నిర్ణయించామని, టికెట్ ధరలను పెంచాలన్న ఉద్దేశం లేదని క్యాబ్ స్పష్టం చేసింది. మొత్తం 67 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్ ని తిలకించే అవకాశం ఉండగా, కేవలం టికెట్ అమ్మకాల ఆదాయం మాత్రమే క్యాబ్ కు మిగులుతుంది. దీన్ని ఈ సంవత్సరం తమకు అదనంగా వచ్చే ఆదాయంగా పరిగణించనున్నామని క్యాబ్ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News