: డొనాల్డ్ ట్రంప్ పై నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకత!
సాధారణంగా అమెరికాలో రాజకీయ పార్టీల సభలు రద్దవడం అత్యంత అరుదు. కానీ రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తీవ్ర గందరగోళం మధ్య ప్రచార సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇస్లాం మతం, వలసదారులు, హెచ్ 1-బీ తదితరాలపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు ట్రంప్ సభను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో, అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ప్రజల భద్రత రీత్యా సభను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఘటన రిపబ్లికన్ పార్టీకి అంత మంచిది కాదని టెడ్ క్రుజ్, రుబియో వ్యాఖ్యానించారు. ఆయనపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు.