: తల్లి, చెల్లి, భార్యకు తేడా తెలీని శ్రీకాంత్ బతకడం వేస్ట్: మీడియాతో మధుప్రియ
కేవలం ఆరు నెలల్లోనే గాయని మధుప్రియ వివాహబంధం తెగిపోయింది. గత రాత్రి భర్తపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, భర్తను తిట్టిపోశారు. "తాగి తందనాలు ఆడతాడు. తల్లి, చెల్లి, భార్య అన్న తేడాలు తెలీని వాడు బతకడం వేస్ట్. ఇలాంటి వాళ్లను ఏం చేసినా తప్పులేదు. నిన్న కూడా నన్ను కొట్టాడు (చేతిమీద ఉన్న గాయాలు చూపించారు). పెళ్లయినప్పటి నుంచి శ్రీకాంత్ ను నేనే పోషిస్తున్నా. మూడు నెలలు బాగానే చూసుకున్నాడు. ఆపై తన క్రూరత్వాన్ని చూపడం ప్రారంభించాడు. నా తలపై బలమైన గాయం ఉంది. ఆడపిల్లలు ప్రేమించాలని చెప్పడం లేదు. ప్రేమించండి. కానీ, పెద్దలను మాత్రం ఎదిరించ వద్దు. వారిని కాదని పెళ్లి చేసుకోవద్దు. ఈ ఆరు నెలల కాలంలో, 60 నెలల అనుభవాన్ని నేర్చుకున్నా" అని అన్నారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చి చూస్తామని చెబుతున్నారు.