: లండన్ లో అమరావతి కార్యాలయం ఏర్పాటు : సీఎం చంద్రబాబు


లండన్ లో అమరావతి కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధి మండలి ద్వారా పెట్టుబడిదారులతో ఈడీబీ సీఈఓ కృష్ణ కిశోర్ సంప్రదింపులు జరపనున్నట్లు చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన చంద్రబాబు ఈ రోజు అక్కడి పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. అంతకుముందు లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీని చంద్రబాబు సందర్శించారు. ఆ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అమరావతి శిల్పాలను చంద్రబాబు బృందం పరిశీలించింది. బ్రిటిష్ మ్యూజియానికి శిల్పాలు చేరిన వైనాన్ని అడిగి తెలుసుకున్నారు. లండన్ లోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. అక్కడ ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News