: 1,131 పరీక్ష కేంద్రాల్లో టీఎస్ పోలీస్ ప‌రీక్ష‌లు


తెలంగాణ‌లో నిర్వ‌హించ‌నున్న పోలీస్ ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న‌ట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఏప్రిల్ 3వ తేదీన జరగబోయే ఈ ప‌రీక్ష‌కు అభ్య‌ర్థుల నుంచి భారీగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయని పేర్కొన్నారు. ఈ ప‌రీక్ష‌ల‌కు 1,131 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయ‌న తెలిపారు. మొత్తం 9,281 కానిస్టేబుళ్ల పోస్టులకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 539 ఎస్సై పోస్టులకు 1.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు మాట్లాడుతూ.. జేఎన్‌టీయూ సహకారంతో పరీక్షలు జరుగనున్నాయన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమ‌ని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమ‌ని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News