: నీటి కొరత... పశ్చిమ బెంగాల్ లోని పవర్ ప్లాంట్ మూసివేత


గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ లోని ఫరక్కా ఎన్టీపీసీ లో నీటి కొరత తీవ్రంగా ఉంది. నీటి సమస్య ఈరోజు మరీ ఎక్కువగా ఉండటంతో ప్లాంట్ లోని ఐదు యూనిట్లను మూసివేశారు. ఈ మేరకు ఎన్టీపీసీ అధికారులు ఒక ప్రకటన చేశారు. కాగా, గత పదేళ్లలో ఈ ప్లాంట్ ను మూసివేయడం ఇదే మొదటిసారి అని, నీటి కొరత కారణంగా విద్యుదుత్పత్తి తగ్గిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నీటితో కేవలం ఆరో యూనిట్ మాత్రమే నడుస్తుందని... 500 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని అధికారులు చెప్పారు. ఫరక్కా ఎన్టీపీసీలో ఐదు యూనిట్లు మూసివేయడంతో దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలపై పడుతుందని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News