: మాల్యా అప్పులకు.. 'క్యాలెండర్ గర్ల్స్'కు లింకుపెట్టిన దర్శకుడు వర్మ
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్లకు పెట్టిందిపేరు. కింగ్ ఫిషర్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా అప్పులపై హాట్ హాట్ గా ప్రస్తుతం చర్చ జరుగుతున్న సమయంలో వర్మ ట్వీట్లు మరింత హాట్ గా ఉన్నాయి. విజయ్ మాల్యా అప్పులపై...వాటిని ఏ విధంగా తీర్చాలనే దానిపై వర్మ ట్వీట్లు చేశాడు. మాల్యా బకాయిపడ్డ బ్యాంకులకు డబ్బులు కట్టే బదులు ఆయన దగ్గర ఉన్న క్యాలెండర్ గర్ల్స్ ని ఒక్కొక్క బ్యాంకు కి ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని ఒక ట్వీట్ లో వర్మ సూచించాడు. విజయ్ మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్ గర్ల్స్ ఆస్తులేమైనా ఒకవేళ పెరిగి ఉంటే కనుక ఆయన అప్పులను వారు కూడా తీర్చాలంటూ మరో ట్వీట్ లో... మాల్యా అప్పుల కింద క్యాలెండర్ గర్ల్స్ ను ఆయా బ్యాంకులు అంగీకరించకపోవచ్చు, కానీ, బ్యాంకర్లు మాత్రం అంగీకరిస్తారని ఇంకో ట్వీట్ లో వర్మ చురకలేశాడు.