: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి మాతృవియోగం


బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తల్లి మహేరా హష్మీ మృతి చెందారు. ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో నిన్న రాత్రి ఆమె కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హష్మీ సన్నిహిత వర్గాల సమాచారం. మహేరా హష్మీ భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం రొమానియా పర్యటనలో ఉన్నారు. తన తల్లి మరణవార్త విషయం తెలియడంతో ఆయన తిరిగి భారత్ కు బయలుదేరినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News