: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ఆసియా ఆశాకిరణం: ప్రధాని నరేంద్ర మోదీ


ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ఆసియా ఆశాకిరణమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో నేటి ఉదయం ప్రారంభమైన ‘అడ్వాన్సింగ్ ఆసియా’ సదస్సుకు హాజరైన ఆయన కీలక ప్రసంగం చేశారు. ఆసియాలో కీలక దేశంగా ఉన్న భారత్... ఆ ప్రాంత అభివృద్ధికి సుదీర్ఘ కాలంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజాస్వామ్యం, పురోగతి కలిసి సాగలేవన్న అపవాదును భారత్ తిప్పికొట్టిందన్నారు. భిన్న సంస్కృతులు కలిగిన భారత్... ఆర్థికంగా వృద్ధిని సాధిస్తూనే, సామాజిక స్థిరత్వాన్ని కూడా కాపాడుతోందన్నారు. భారత్ సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ఆసియా అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోందన్నారు. వ్యాపారం కోసం తామెన్నడూ పొరుగు దేశాల ప్రయోజనాలను పణంగా పెట్టలేదన్నారు. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్నిసాధించామన్నారు. దేశంలో కీలక రంగాలైన గ్రామీణ, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులను ఇబ్బడిముబ్బడిగా పెంచామన్నారు. రైతులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రధాని ప్రకటించారు.

  • Loading...

More Telugu News