: కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం!... ‘అనంత’ రుణమేళాలో చినరాజప్ప ఉద్ఘాటన
కాపు సామాజిక వర్గ సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పునరుద్ఘాటించారు. కాపులకు రుణాల మంజూరు కోసం అనంతపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాపు రుణమేళాను ఆయన కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న కాపులందరికీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నాయన్నారు. కాపు ఐక్య గర్జన పేరిట తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వంసకాండపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.