: వైసీపీకి ఐదేళ్లు నిండాయి!... నేడు ఆవిర్భావ వేడుకలు
వైసీపీగా మనమంతా పిలుస్తున్న ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’కి నేటితో ఐదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా నేడు ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ నిర్వహిస్తోంది. హైదరాబాదు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఆ పార్టీ కార్యాలయాలన్నింటిలో వేడుకలను నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. లోటస్ పాండ్ కార్యాలయంలో జరగనున్న వేడుకల్లో పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.