: కన్నయ్య అండ్ కోకు మరింత ఊరట... అకడమిక్ సస్పెన్షన్ ఎత్తివేత


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరికి నిరసనగా ర్యాలీ నిర్వహించడమే కాక జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కింద వర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, మరో ఐదుగురిపై దేశ ద్రోహం కేసులు నమోదయ్యాయి. కేసుల నేపథ్యంలో వర్సిటీ అధికారులు కన్నయ్య సహా మొత్తం 8 మంది విద్యార్థులపై అకడమిక్ సస్పెన్షన్ విధించారు. దీంతో వర్సిటీలోనే ఉన్నా కన్నయ్య అండ్ కో తరగతులకు హాజరయ్యే పరిస్థితులు లేవు. రాజద్రోహం కేసుల కింద అరెస్టైన కన్నయ్యకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా అతడితో పాటు అతడి మిత్ర బృందంపై విధించిన అకడమిక్ సస్పెన్షన్ ను వర్సిటీ అధికారులు ఎత్తేశారు. ర్యాలీ, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు తదితరాలపై విచారణ చేపట్టిన ఉన్నత స్థాయి కమిటీ అందజేసిన నివేదికతోనే వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News