: కుంభమేళాను తలపించేలా వేదిక ఏర్పాటు చేశారు: ప్రధాని మోదీ


కుంభమేళాను తలపించేలా వేదికను ఏర్పాటు చేశారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల కోసం 150 దేశాల ప్రజలు ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రపంచానికి భారతదేశం ఎంతో ఇచ్చిందని.. ఆర్థికంగానే కాకుండా సాంస్కృతికంగానూ ప్రపంచంతో భారత్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు.

  • Loading...

More Telugu News