: సోషల్ మీడియాలో ‘బ్రహ్మోత్సవం’ ఫొటోలు


ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం సెట్ లోని కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉంచారు. ఈ ఫొటోల్లో మహేశ్ బాబు, సమంత, వెన్నెల కిషోర్ ఉన్నారు. కాగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీవీపీ, మహేశ్ బాబు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News