: అరకు ఎంపీ గీత కుల వివాదంలో న్యూ ట్విస్ట్!
అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల వివాదంలో ఇది మరో ట్విస్ట్. ఎస్టీలకు రిజర్వ్ కాబడిన నియోజకవర్గం నుంచి గీత గెలుపొందగా, ఆమె ఎస్టీ కాదని కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా ఓ కమిటీని వేయగా, ఆమె సోదరుడు వివేకానందకుమార్ షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తి కాదని తేలింది. ఇదే విషయాన్ని కమిటీ నివేదిక రూపంలో కలెక్టరుకు ఇవ్వగా, ఆయన గీత వివరణ కోరారు. తాను పార్లమెంట్ సమావేశాల కారణంగా బిజీగా ఉన్నందున వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కొత్తపల్లి గీత కోరినట్టు సమాచారం.