: తెలంగాణ అసెంబ్లీకి సెలవుల్లేవ్!... శని, ఆదివారాలు కూడా కొనసాగింపునకు నిర్ణయం


తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి సెలవులు రద్దయ్యాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్న బడ్జెట్ సమావేశాలను శని, ఆదివారాల్లోనూ నిర్వహించాలని సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) తీర్మానించింది. నేటి సమావేశాల్లో భాగంగా పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి సంతాపం తెలిపిన సభ రేపటికి వాయిదా పడింది. ఆ తర్వాత స్పీకర్ చాంబర్ లో జరిగిన బీఏసీ సమావేశంలో సెలవు దినాల్లోనూ సమావేశాలను కొనసాగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విపక్షాలు కూడా సరేనన్నాయి. దీంతో ఈ దఫా బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి సెలవులు రద్దైపోయాయి. సమావేశాల్లో భాగంగా ఈ నెల 14న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.

  • Loading...

More Telugu News